Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపివేస్తే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 31 జులై 2021 (09:19 IST)
కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే కలిగే ఫలితాలపై తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ  ఆస్పత్రిలో పరిశోధనలు జరుగనున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా జనవరి 16నుంచి ఇప్పటివరకూ దేశమంతటా 45కోట్ల మందికి టీకాలు వేశారు.

ఆ సమయంలో పొరపాటున కొందరికి ఒక్కో డోస్‌లో ఒక్కోరకం వ్యాక్సిన్‌ వేశారు. రెండు రకాల టీకాలు వేసుకున్నా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వారు ఆరోగ్యంగా ఉన్నారు. థాయ్‌లాండ్‌ సహా కొన్ని దేశాల్లో ఈ రెండు టీకాలు కలిపి వేస్తున్నారు.

దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో మన దేశంలోనూ రెండు టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై పరిశోధనలు జరిపేందుకు కేంద్ర మందుల నాణ్యతా నియంత్రణ మండలి వైద్యనిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో 300మందిపై ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిన్‌లను ఒకే డోస్‌గా వేసి పరిశీలించనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments