Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరసా కాకర కాయ.. పో పో షాపులు తెరుచుకోవాలి, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (00:09 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ ప్రభావంతో జనం రోడ్లమీద వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యాలే ఈ వైరస్‌ను తలుచుకుని వణుకుతుంటే తిరుపతికి చెందిన షాపుల యజమానులు కరోనా వైరసా కాకరకాయ అంటూ గట్టిగా కేకలు వేశారు.
 
ఇదంతా తిరుపతి నగరం ఎయిర్ బైపాస్ రోడ్డులో జరిగింది. ఎపి ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే జనం మాత్రం తెల్లవారుజాము నుంచి గుమిగూడి కనిపించారు. అన్నిచోట్లా జనసంచారం కనిపించింది. నిత్యావసర వస్తువుల పేరుతో జనం గుంపులు గుంపులుగా గుమిగూడి కనిపించారు. 
 
తిరుపతి మార్కెట్లో అయితే జనం నిండుగా కనిపించారు. కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇష్టమొచ్చినట్లు అధిక ధరలకు కూరగాయలను విక్రయించేశారు మార్కెట్ వ్యాపారస్తులు. 
 
అయితే 10 గంటలకు నగరం మొత్తం జనం కనిపించారు. ఒక్కసారిగా నగర పాలకసంస్ధ అధికారులు షాపుల వద్దకు వెళ్ళి  మూసేయమన్నారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్దకు రాగా ఇద్దరు షాపుల యజమానులు మీ దగ్గర ప్రభుత్వం ఆదేశించినట్లుగా జిఓ ఏమైనా ఉందా అంటూ నగర పాలక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
 
మేము షాపులు నడుపుకోవాలి.. మాకు వేరే ఆదాయం లేదు. కరోనా వైరసా... కాకర కాయా దానికి మేము భయపడమంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో నగర పాలకసంస్థ సిబ్బందే ఆశ్చర్యపోయారు. విషయం కాస్త తిరుపతి నగర పాలకసంస్ధ కమిషనర్ దృష్టికి వెళ్ళింది. 
 
దీంతో ఆయనే స్వయంగా వచ్చి షాపు యజమానులకు అర్థమయ్యేలా చెప్పారు. పదిరోజుల పాటు షాపులు మూసివేయాలని..కరోనా ఎంత భయంకరమో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో షాపుల యజమానులు తమ తమ షాపులను మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments