శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా.. వరంగల్ మేయర్ దంపతులకు కోవిడ్

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:15 IST)
కరోనా మహమ్మారి తెలంగాణలో శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చుట్టేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ నేతలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ నేతల గన్‌మెన్స్, పిఏలకు ఇలా కరోనా సోకింది.
 
తాజాగా.. వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో గన్‌మెన్‌తో పాటు సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా.. మేయర్ దంపతులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారనే విషయం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments