గత 24గంటల్లో కొత్తగా 38903 కరోనా కేసులు.. 543 మంది మృతి

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:01 IST)
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 38903 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు ఒకే రోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1077618కి పెరిగింది. అలాగే. గత 24 గంటల్లో దేశంలో 543 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 26816కి పెరిగింది. 
 
అలాగే భారత్‌లో తాజాగా... కరోనా నుంచి 23672 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 677422కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 62.9గా ఉంది. విదేశాలతో పోల్చితే... ఇండియాలో రికవరీ రేటు బాగుంది.  
 
అయితే దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 300937 పాజిటివ్ కేసులు ఉండగా, తమిళనాడులో 165714 కేసులున్నాయి. ఇక ఢిల్లీలో 121582, కర్ణాటకలో 59652, గుజరాత్‌లో 47390, ఆంధ్రప్రదేశ్‌లో 44609, తెలంగాణలో 43780, బెంగాల్‌లో 40209 కేసులున్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో ఈమధ్య కరోనా జోరు బాగా ఉంది. 
 
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో కరోనా వేగంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లోకి వస్తే... దేశవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments