Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (16:15 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. ప్రతి రోజూ వందలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూ పడకలు నిండిపోతున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
గత యేడాదితో పోల్చితో 15 రాష్ట్రాల్లో ఇపుడు ఐసీయు పడకలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఆరోగ్య మానవ సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లలో 37, 41, 34 శాతం మేరకు ఐసీయు పడకలు నిండుకున్నట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా వెయ్యి వరకు ఉంది. గత మూడు నెలలుగా ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. న్యూజెర్సీలో ఐసీయూలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా 24 శాతం మేరకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments