అమెరికాలో కరోనా విశ్వరూపం.. ఒకే రోజు 91,295 కేసులు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:23 IST)
వచ్చే నెలలో శ్వేతసౌధం పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధినేత ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్‌లు పోటీ చేస్తున్నారు. అయితే, అమెరికాలో శాంతించిందని భావించిన కరోనా మహమ్మారి ఒక్కసారిగా విశ్వరూపందాల్చింది. ఒకే రోజు ఏకంగా 91 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. 
 
నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం అమెరికాలో రికార్డు స్థాయిలో 91,295 కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. 
 
ఈ నెల 15 నుంచి అమెరికాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోయింది. ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానానికి చేరింది.
 
కాగా, అమెురికా తర్వాత 80,88,851 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్ 54,96,400 కేసులతో మూడో స్థానంలో ఉంది. గురువారం బ్రెజిల్‌లో 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, రెండో వేవ్ మొదలైన ఫ్రాన్స్‌, యూకేల్లోనూ కరోనా విజృంభణ ఉద్ధృతంగా వుంది. నిన్న ఫ్రాన్స్ లో ఏకంగా 47,000 కేసులు నమోదుకాగా యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments