కరోనా వ్యాక్సిన్ రెడీ.. శుభవార్త చెప్పిన అమెరికా శాస్త్రవేత్తలు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (14:00 IST)
కరోనా వ్యాక్సిన్ విషయంలో అమెరికా నుంచి మరో శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌తో ఊహించిన విధంగానే మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలిదశ ప్రయోగాలు పూరైనాయని.. ఫైనల్ టెస్టింగ్ దశకు చేరుకుందని తెలిపారు.

జులై 27 నుంచి ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియ మొదలు పెడతామని అమరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ దశంలో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామని తెలిపారు. 
 
ఈ వాక్సీన్‌ను అమెరికా దిగ్గజ ఔషధ సంస్థ మోడర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వాక్సీన్ తీసుకున్న తొలి 45 మందిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాక్సీన్ ఇచ్చిన తర్వాత కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవని గుర్తించినట్లు వివరించారు. 
 
కొందరిలో మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఐతే వాంతులు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లేవు. ఈ వ్యాక్సిన్ నెలలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments