ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈయన ప్రకాశం జిల్లా వాసి. అలాగే, మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ రెండు కేసులో కొత్తగా వెలుగు చూశాయి. దీంతో వీరిద్దరితో కాంటాక్ట్ అయిన సెకండరీ కాంటాక్ట్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 
 
422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. అలాగే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,987కు చేరుకుంది. ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరింది. 
 
ఇకపోతే, ఈ వైరస్ నుంచి 7,091 మంది కోలుకున్నారు. మరో 162 మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 130 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఇప్పటివకు దేశంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కు చేరింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతి బరిలో సత్తా చాటిన అనగనగా ఒక రాజు - 5 రోజుల్లో రూ.100 కోట్లు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

ఆ ముగ్గురు దర్శకులు అడిగితే స్పెషల్ సాంగ్‌లు చేస్తా : రష్మిక మందన్నా

Vijay Sethupathi: డైలాగ్ కూడా లేకుండా రూపొందిన గాంధీ టాక్స్ టీజ‌ర్‌

విజయ్ వీరాభిమానిని - ఆ సినిమాకు జరిగినట్టు మరో చిత్రానికి జరగరాదు : సుధా కొంగరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

తర్వాతి కథనం
Show comments