Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (15:05 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు తేలింది. ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి వెంట ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య, జెడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, మరికొందరు జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి పంట నష్టాన్ని అంచనా వేశారు. 
 
వీరిలో గండ్రా వెంకటరమణా రెడ్డి దంపతులకు కోవిడ్ సోకింది. ఈ క్రమంలో వారితో కలిసి తిరిగిన మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో తనతో కాంటాక్ట్ అయినవారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కరోనా అంతానికి సమయం సమీపిస్తుంది
భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఈ యేడాది మార్చి మూడో వారానికి అంతం కావొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే మార్చి 11వ తేదీ నాటికి ఈ వైరస్ అంతం కావొచ్చని తెలిపారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని ఇదేవిధంగా మరికొంత కాలం కొనసాగించినట్టయితే మార్చి 11వ తేదీ తర్వాత ఈ వైరస్ అంతులేకుండా పోతుందన్న నమ్మకం ఉందన్నారు. అయితే, ఈ మధ్యలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకురాకుండా ఉండాలన్నారు. మార్చి 11వ తేదీ నాటికి ఈ కరోనా వైరస్ సాధారణ ఫ్లూ (ఎండమిక్)గా మారిపోతుందన్నారు. 
 
డెల్టా వైరస్ స్థానాన్ని ఒమిక్రాన్ వైరస్ భర్తీ చేసి, అపుడు మరో కొత్త రకం వైరస్ రాకపోతే కరోనా ఎండమిక్‌గా మారిపోయేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ అంచనా మేరకు ఒమిక్రాన్ వైరస్ మూడు నెలలో పాటు ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ మన దేశంలో డిసెంబరు 11వ తేదీన వెలుగు చూసిందని, అంటే మార్చి 11వ తేదీ తర్వాత అంతం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments