దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:50 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోల్చితే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ బారి నుంచి 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది. 
 
టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 50.26 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments