దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (11:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.79 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 18815 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు ఏకంగా 4.96 శాతానికి పెరిగింది. 
 
అలాగే, కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తోంది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి కరోనా సోకిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతవ్యాప్తి కారణంగా క్రియాశీల కేసులు 1,22,335కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.27 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.52 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 15,899 మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

తర్వాతి కథనం
Show comments