త్వరలోనే కరోనా రహిత దేశంగా భారత్...?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:10 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 36,469 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదేసమయంలో 63,842 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,46,429కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 488 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,19,502 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,01,070 మంది కోలుకున్నారు. 6,25,857 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,44,20,894 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,58,116 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 837 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,554 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,13,466 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,315 కి చేరింది. ప్రస్తుతం 17,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 14,851 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 59 కేసులు నిర్ధారణ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments