Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా ఉధృతి : కొత్తగా 8 వేల పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (11:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. కొత్త‌గా 8 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. శ‌నివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌రో 8126 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. కొత్త‌గా 38 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, 3307 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది. ఇందులో 62,929 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 3,30,304 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 1999 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.50 శాతంగా ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 83.57 శాతంగా ఉన్న‌ది.
 
కొత్త‌గా న‌మోదైన‌ పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1259 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, న‌ల్ల‌గొండ‌లో 346, ఖ‌మ్మ‌లో 339, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 334 చొప్పున నమోదయ్యాయి. 
 
అలాగే, , సిద్దిపేట‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో 306, క‌రీంన‌గ‌ర్లో 286, జ‌గిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో నిన్న 1,08,602 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 1,24,93,399కి చేరింది.
 
మరోవైపు, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్న‌ర ల‌క్ష‌లకు చేరువైంది. గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు న‌మోదు కాగా.. మ‌రో 2767 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రో 2,17,113 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
 
దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కోలుకున్న వారు 1,40,85,110 మంది కాగా.. 1,92,311 మంది చ‌నిపోయారు. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 14,09,16,417 వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments