కరోనా టెస్టింగ్ ఆంబులెన్స్ కోసం.. కేటీఆర్‌కు చెక్కు అందించిన మల్లారెడ్డి

Webdunia
సోమవారం, 27 జులై 2020 (16:53 IST)
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సు కోసం భారీ విరాళం ప్రకటించారు.

ఆరు కరోనా టెస్టింగ్ ఆంబులెన్సులను ప్రభుత్వానికి సమకూర్చేందుకు అవసరమైన నగదుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్‌కు మల్లారెడ్డి అందజేశారు. అలాగే చెరువుల సుందరీకరణ, శుద్ధీకరణ, ఎకో టూరిజం పార్కుల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను మల్లారెడ్డి కోరారు.
 
ఇంకా నూతనంగా ఏర్పడిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు గతంలో టీయూఎఫ్ఐడీసీ నుండి మంజూరు చేసిన రూ.25.82 కోట్ల అభివృద్ధి నిధులను ప్రాధాన్యతా కమ్రంలో విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. నిధులు విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
 
కాగా.. గతంలో కరోనా రక్కసిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ తారాలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి భారీ విరాళాన్ని ప్రకటించారు.
 
మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రూ.50 లక్షలు, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల రూ.25 లక్షలు, ఇతరులు అందజేసిన రూ.47 లక్షల విరాళాల చెక్కులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments