Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్‌ ICU: ట్యాంక్‌బండ్‌పై కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (20:45 IST)
KTR
కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 
 
కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ న్నారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కోవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.
 
మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments