బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

ఠాగూర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (20:16 IST)
నేటి సమాజంలో బంధు బంధుత్వాలు, మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ తమ్ముడు బీమా డబ్బుల కోసం ఏకంగా అన్ననే హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నవంబరు 29వ తేదీన రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్‌ (39) టిప్పర్‌ ఢీకొని మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి మట్టి తరలిస్తున్న టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌ కాగా.. వెంకటేశ్‌ టిప్పర్‌ ముందు భాగంలో మరమ్మతు చేస్తున్నాడు. ఇది గమనించిన మృతుడి తమ్ముడు నరేష్‌.. టిప్పర్‌ స్టార్ట్‌ చేసి ముందుకు నడిపించగా, అది కాస్త వెంకటేశ్‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు అని మృతుడి తండ్రి నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. వెంకటేశ్‌ హత్యకు కుట్ర ప్రణాళికను నిందితులు ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియో దొరకడంతో అసలు విషయం వెలుగు చూసింది. 
 
ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు వెంకటేశ్‌ పేరుతో రెండు నెలల్లోనే 10 కంపెనీలలో రూ.4.14 కోట్ల విలువైన బీమా పాలసీలు నరేశ్‌ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా సొమ్ము కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments