ముక్కోటి ఏకాదశి.. ఉప్పల్ కార్పొరేటర్ దంపతులకు కరోనా పాజిటివ్..

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:07 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితా పరమేశ్వర్‌రెడ్డి దంపతులు కరోనా బారినపడ్డారు. 
 
దంపతులిద్దరికీ కరోనా సోకినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని శుక్రవారం నిర్ధారణ అయినట్లు తెలిపారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అవుతున్నట్లు కార్పొరేటర్‌ దంపతులు ప్రకటించారు. వివిధ కార్యక్రమాల్లో తమతోపాటు పాల్గొన్న వారు కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. 
 
శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కార్పొరేటర్‌ దంపతులు ఉప్పల్‌లోని కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉప్పల్‌ రామాలయం, రామంతాపూర్‌లో సత్యనారాయణస్వామి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments