Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషికేష్‌లో హోటల్ తాజ్ మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (08:14 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో హోటల్ తాజ్‌ను మూసివేశారు. ఈ హోటల్‌లో పని చేసే సిబ్బందిలో 76 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసి, శానిటైజ్ చేస్తున్నారు. 
 
కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రిషికేష్‌ నగరంలోని హోటల్ తాజ్ ఐదు నక్షత్రాల హోటల్‌లో 76 మందికి కరోనా సోకింది. దీంతో తెహ్రీ గర్హ్వాల్ అధికారులు హోటల్ తాజ్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
కరోనా కేసులు వెలుగుచూసిన హోటల్ తాజ్‌ను శానిటైజ్ చేయించి ముందుజాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేశామని తెహ్రీ గర్హ్వాల్ ఎస్పీ తృప్తి భట్ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1660 కరోనా కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో మొత్తం 96,512 కరోనా కేసులు నమోదు కాగా, 1709 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments