Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సారంగ దరియా" పాట విషయంలో వివాదం ముగిసిందిః శేఖ‌ర్‌క‌మ్ముల‌

Advertiesment
, బుధవారం, 17 మార్చి 2021 (19:21 IST)
Sekar kammula, komali
"లవ్ స్టోరి" చిత్రంలో 'సారంగ దరియా' పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియా పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ప్రకటన చేసింది. 
 
గాయని కోమలి మాట్లాడుతూ...సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాను. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొవరతో ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అన్నారు.
 
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా చేయ‌డానికి ఆవిడ భయపడిందిః విష్ణు మంచు