దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి - కొత్తగా 63 వేల కేసులు

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:31 IST)
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడచిన 24 గంటల్లో 63,489 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 944 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,89,682కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,980 కి పెరిగింది. ఇక 6,77,444 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,62,258 మంది కోలుకున్నారు.
 
అలాగే, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,102 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,930  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరింది. ఆసుపత్రుల్లో 22, 542 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  68,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 693కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 234 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments