Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ కొరియాను వణికిస్తున్న కరోనా - ఒకే రోజు 4 లక్షల కేసులు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (07:55 IST)
కరోనా వైరస్ మళ్లీ వణికిస్తుంది. ఇప్పటికే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం సంపూర్ణ, పాక్షిక లాక్డౌన్‌లను అమలు చేస్తున్నారు. మరోవైపు, సౌత్ కొరియాను కరోనా వైరస్ చెరబట్టినట్టు తెలుస్తుంది. ఒకే రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైచిలుకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కలకలం చెలరేగింది. 
 
కరనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో 4,00,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 293 మంది మృత్యువాతపడినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది. 
 
భారత్‌కు పొంచివున్న ముప్పు 
పొరుగు దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరేలా కనిపిస్తుంది. రోజువారీగా నమోదయ్యే స్టెల్త్ ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చైనాలోని పలు నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. 
 
మరోవైపు, చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో భారత్‌కు కూడా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కరోనా వైరస్ ఏకంగా 75 శాతం మందికి సోకవచ్చని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే జూలై నెలలో నాలుగో వేవ్ ప్రారంభంకావొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments