Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్.. స్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. అంతే కరోనా పరార్..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:12 IST)
Rum
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా వైరస్‌ నుంచి దూరంగా వుండాలంటే.. మంగళూరుకు చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ ఇలా చేయాలంటున్నారు. అదేంటంటే.. రమ్, మిరియాల పొడి, ఆమ్లేట్ ఈ మూడింటితో కరోనాను దూరంగా వుంచవచ్చునని చెప్తున్నారు. 
 
ఇలా చేస్తే కరోనా దగ్గరికి కూడా రాదని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరు మున్సిపల్ కౌన్సిలర్ రవిచంద్ర గట్టి.. కరోనాకు రమ్ మేలైన చికిత్స అంటూ చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
90 ఎమ్ఎల్ రమ్, ఓ టీస్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. ఈ కాంబోను ట్రై చేస్తే కరోనానే భయపడి దగ్గరికి రాదంటున్నారు ఈ కౌన్సిలర్.  రమ్‌లో మిరియాల పొడి కలుపుకుని తాగాక ఆమెట్లు తింటే ఈ మహమ్మారి పీడ విరగడైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎన్నో చికిత్సలను ప్రయత్నించిన మీదట తనకు ఇది ప్రభావశీలంగా కనిపించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఓ రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదని, కరోనా కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments