Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతి నది నీటి నమూనాల్లో కరోనా జాడలు..

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (21:43 IST)
అహ్మదాబాద్‌లో సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు తేలింది. అహ్మదాబాద్ నగరంలోని కంక్రియ, చందోలా సరస్సుల్లోని వాటర్ శాంపిల్స్‌లో కూడా వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. 
 
2019 సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్ 29 మధ్య ప్రతి వారం ఒకసారి నీటి శాంపిల్స్‌ను తాము సేకరించామని, సబర్మతి నది నుంచి 694 శాంపిల్స్‌ను, చందోలా సరస్సు నుంచి 549, కంక్రియ సరస్సు నుంచి 402 శాంపిల్స్‌ను సేకరించినట్లు ఐఐటీ గాంధీనగర్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ చెందిన పరిశోధకులు తెలిపారు. 
 
సబర్మతి నది మరియు కంక్రియ, చందోలా సరస్సుల్లో నుంచి నమూనాలను సేకరించి పరిశీలించగా.. వీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. సరస్సులు, నదుల్లో కరోనా వైరస్ ఉనికి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని ఐఐటీ గాంధీనగర్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మనీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
2019 సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్ 29 మధ్య ప్రతి వారం ఒకసారి నీటి శాంపిల్స్‌ను తాము సేకరించామని, సబర్మతి నది నుంచి 694 శాంపిల్స్‌ను, చందోలా సరస్సు నుంచి 549, కంక్రియ సరస్సు నుంచి 402 శాంపిల్స్‌ను సేకరించినట్లు ప్రొఫెసర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. సహజ నీటివనరుల్లో వైరస్ ఎక్కువకాలం ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments