కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలదన్నట్లు కొత్త కొత్త ఫంగస్ వ్యాధులు. కొత్త స్ట్రెయిన్లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రకరకాల మ్యుటేషన్లు, స్ట్రెయిన్లతో కొత్తరూపాన్ని మార్చుకుంటోంది. వ్యాక్సిన్లకు ఏ మందుకు లొంగనంతగా ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్, డెల్టా పస్ల్ వంటి అనేక స్ట్రెయిన్లతో బెంబేలిత్తిస్తోన్న కరోనా.. మరోసారి రూపాంతరం చెందింది. రష్యాలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కనుగొన్నారు. రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్‌కు చెందిన సైంటిస్టులు మాస్కో స్ట్రెయిన్‌ను గుర్తించారు.
మాస్కోలో తొలిసారిగా ఈ వైరస్ బయటపడింది.. అందుకే దీన్ని మాస్కో స్ట్రెయిన్‌గా పేరొచ్చింది. రష్యాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు సైంటిస్టులు వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపుతుందో పరిశోధించే పనిలో పడ్డారు సైంటిస్టులు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై రష్యా వ్యాక్సిన్ సమర్థంగానే పని చేస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు.