కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:13 IST)
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళుతుండగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, అందులో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయింది.
 
పైగా, రాజ్‌నాథ్ ‌సింగ్‌ను పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మంత్రి ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అతనికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
12 వేలు దాటిన కరోనా వైరస్ కేసులు.. 
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12 వేలు దాటిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12591కు చేరింది. బుధవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 20 శాతం మేరకు పెరిగింది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్ బీబీ 1.16 బాధితులే ఎక్కువా ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన వారంతా వీలైనంత త్వరగా బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించింది.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొదటి, రెండో డోసులు కలిపి 220.66 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.67శాతంగా ఉందన్న కేంద్రం.. గడిచిన 24 గంటల్లో 10,827 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు 92.48 కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 2,30,419 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments