Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులు బాదుడు, కరోనా వచ్చినా ఇంట్లోంచి కదలని తెలంగాణ పేషెంట్లు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:59 IST)
నిన్న మొన్నటి వరకు  ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తెలంగాణలో తగ్గుముఖం పట్టిందా? లేక ప్రజల్లో మనోధైర్యం పెరిగిందా? రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రిలో మాత్రం బెడ్స్ ఖాళీ అవ్వడం వెనుక మర్మం ఏమిటి. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లంతా హోం ఐసోలేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా..?
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం ఆక్సిజన్, ఐసియూ పడకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గతంలో కరోనా పాజిటివ్ వస్తే చాలు బాధితులు ఉరుకులు పరుగులు మీద ఆసుపత్రికి వచ్చేవారు.
 
లక్షణాలు లేకపోయినా పాజిటివ్ తేలితే ఆసుపత్రులకు వచ్చి సాధారణ పడకల్లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేవారు. ప్రస్తుతం సాధారణ లక్షణాలుంటే ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా తగ్గింది. కేవలం ఆక్సిజన్, ఐసియూ కావలసిన రోగులు మాత్రమే ఆస్పత్రికి వెళుతున్నారు.
 
దీంతో కొన్ని ఆస్పత్రులలో కరోనా రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనాతో నిన్న మొన్నటి వరకు హైరాన పడుతున్న ప్రజలు మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. ప్రజల్లో కరోనా ఆందోళన తగ్గితే మరణాల సంఖ్య కూడా తగ్గుతుందనడానికి ఇదే నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments