Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతులపై కరోనా టీకా ప్రయోగం... మరో విజయం సాధించిన ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:09 IST)
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ అంతానికి ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ముందంజ వేసింది. 'సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19' అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేసింది. కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలించారు.
 
ఈ టీకాను ఆరు కోతులకు ఇచ్చి 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్‌ కారణంగా వచ్చే న్యూమోనియాను ఈ టీకా‌ నిలువరించగలిగినట్లు తేల్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేసుకోగలిగిందని చెప్పారు. 
 
కోతుల్లో వైరల్‌ లోడును తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా ఉపయోగపడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది. అయినప్పటికీ కరోనా సోకకముందే దాన్ని పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
 
కరోనా వైరస్‌ తన స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారా మనిషి కణాల్లోకి చొరబడుతుంది. జలుబు వంటి వాటిల్లోనూ అడినో వైరస్‌లోనూ ఇలాంటి ప్రొటీన్‌ ఉంటుంది. అడినోవైరస్‌ను బలహీనపర్చడం ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ టీకా ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments