Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ఖరారైన తొలి కరోనా కేసు...

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వపరంగా జరగాల్సిన అనేక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. అలాగే, కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
నెల్లూరు పట్టణం, చిన్నబజారుకు చెందిన 24 యేళ్ల యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. అతడు నెల్లూరుకు వచ్చే సమయంలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉన్నాడు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని భావించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. 
 
ఆ తర్వాత అతని రక్తాన్ని సేకరించి పూణెలోని వైరాలజీ పరిశోధనాశాలకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో జరగాల్సిన పలు కార్యక్రమాలను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments