Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ వ్యాప్తిని ఇలా అడ్డుకుందాం...

Advertiesment
కరోనా వైరస్ వ్యాప్తిని ఇలా అడ్డుకుందాం...
, బుధవారం, 11 మార్చి 2020 (09:21 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 113 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ధాటికి నాలుగు వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరికొన్నివేల మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంపై వివిధ రకాల ప్రచారాలు, అవగాహనా కార్యక్రమాలు సాగుతున్నాయి. వైద్యులు మాత్రం... కరోనా వైరస్ పట్ల పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని అంటున్నారు. ఎందుకుంటే... వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ వైరస్ బారినపడకుండా ఉండొచ్చని వారు చెబుతున్నారు. 
 
సాధారణంగా, ఏదేని ముప్పును ఎదుర్కొన్నపుడు లేదా ప్రమాదం సంభవించినపుడు మొదట శరీరం విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. తర్వాత అది పోరాడటమా? లేదా పారిపోవడమా? అనేది నిర్ణయించుకుంటుంది. ఈలోపు కలిగే ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. 
 
ఇక్కడ అతిపెద్ద ముప్పు భయమే. అందుకే భయం కలిగించే విషయాలు, ఆందోళన కలిగించే అంశాలను వ్యాప్తి చేయకూడదు. ఇలాంటి భయాందోళనలు కలింగే అంశాలు, వార్తలను వ్యాప్తి చేయడంలో అర్థం లేదు. "మీరు భయపడకండి. మీ శరీరాన్ని అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దు. మీ రోగనిరోధక శక్తిని నమ్మండి. అదే మిమ్మల్ని ఇలాంటి ఎన్నో వైరస్‌ల నుంచి రక్షిస్తుంది" అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం వారు కొన్ని చిట్కాలు, సూచనలు చేస్తున్నారు. 
 
ఇలా చేయండి..
* బయటి నుంచి వచ్చాక తప్పక చేతులు కడుక్కోవాలి. సానిటైజర్లు వాడాలి.  
* ముక్కు, నోరును చేతులతో తాకవద్దు.
* జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. రెండు మూడు వారాల కింద దేశ విదేశాల నుంచి వచ్చి దగ్గు, ఊపిరి ఆడని స్థితిలో ఉన్న వారికి దూరంగా ఉండండి. 
* జలుబు, జ్వరాలన్నీ కరోనా వైరస్‌కు సంబంధించినవి కావు. వాటిల్లో ఎక్కువ భాగం సాధారణ ఫ్లూలే కావచ్చు. సరైన మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. 
* దగ్గు, తుమ్ము వస్తే అర చేతులు అడ్డు పెట్టకండి. టిష్యూ పేపర్‌ లేదా కర్చీఫ్‌ వాడడం మంచిది. 
* నీరు తగినంత తాగండి. ఏ ఆహారమూ ఒక్కరోజులో మీ రోగనిరోధక శక్తిని పెంచదు. కానీ సిట్రస్‌ జాతి పండ్లు, వెల్లుల్లి తప్పక తీసుకోవాలి. 
* అనారోగ్యంతో ఉన్న వారిని, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లండి. వారు సురక్షితంగా ఉండేందుకు వీలైనంత సహాయం చేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యాహ్నం 2 గంటల లోపే అలాంటి ఆహారం తీసుకోవాలి