Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ అలెర్ట్.. ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రూల్స్..

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (19:20 IST)
Omicron
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో యూరప్ దేశాలు అప్రమత్తమైనాయి. యూకేతో పాటు అధిక రిస్క్ ఉన్న 44 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు దృష్టి సారించారు. కేంద్రం విడుదల చేసిన కొత్త రూల్స్ ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
 
ఇప్పటికే ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూతపడ్డాయి. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. 
 
రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలి. నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.
 
ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తరువాత 8వ రోజు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే బయటకు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 
 
ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే వారిని సపరేట్‌గా క్వారంటైన్‌కు తరలిస్తారు. వారి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేయిస్తారు. ఒకవేళ అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలితే వారిని సాధారణ కరోనా చికిత్సను అందిస్తారు. అదే ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేకమైన చికిత్సను అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments