Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. డిసెంబర్ 31 వరకు పాఠశాలలు బంద్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (10:33 IST)
కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కానీ అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అయినా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకిన దాఖలాలు వున్నాయి. 
 
దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ మహమ్మారి మధ్య పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో 80 మంది ఉపాధ్యాయులకు కరోనా బారినపడ్డారు. అలాగే ఏపీలో 829 మంది ఉపాధ్యాయులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9-12 తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఒడిశా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా వుండే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్న తరుణంలో.. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరవకూడదని ఒడిశా సర్కారు నిర్ణయించింది. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో సెకండ్‌ వేవ్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేసినా పరీక్షలు, మూల్యాకనం, పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. 
 
పాఠశాలల్లో ఆన్‌లైన్‌, దూర విద్య తరగతులు కొనసాగుతాయని, కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఆన్‌లైన్‌ బోధన, టెలీకౌన్సెలింగ్‌ ఉంటాయని, బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావాల్సి ఉంటుందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments