కరోనా-ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు.. దుప్పట్లు ఇచ్చేది లేదు..

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:03 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. భారత్‌లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేశాయి. తాజాగా కరోనా నియంత్రణకు రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులో భాగంగా ముంబై, పూణె, భుసావల్, సోలాపూర్ డివిజన్లకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రజలు ఎక్కువగా గుమికూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
అంతేగాకుండా.. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నామని, వీటిలో ప్రయాణికులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది. వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయరని, అందుకే వీటిని తొలగిస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులు ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments