దేశంలో కరోనా స్వైరవిహారం.. 30 వేల మంది కేంద్ర పోలీసులకు పాజిటివ్

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:08 IST)
దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. దీంతో ప్రతి రోజూ 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ బారినపడుతున్నవారిలో దేశ ప్రజలే కాదు.. సైనిక బలగాలు కూడా ఉన్నాయి. కేంద్రం హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్‌కు చెందిన దాదాపు 36 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 128 మంది మృతి చెందినట్టు తాజా నివేదికను బట్టి తెలుస్తోంది. 30 వేల మంది వైరస్ నుంచి బయటపడగా, 6 వేల మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇక, వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ సిబ్బంది ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 10,636 మంది కరోనా బారినపడగా, సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి ఉన్నారు. ఈ వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోగా, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీలలో 9 మంది చొప్పున మృతి మృతిచెందినట్టు కేంద్రం హోంశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments