Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను ఇలా అడ్డుకుందామని చెప్పిన ప్రిన్స్ మహేష్ కుమార్తె సితార

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (19:59 IST)
సితార
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి నాలుగు వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరికొన్నివేల మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంపై వివిధ రకాల ప్రచారాలు, అవగాహనా కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె కూడా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, దాన్ని అడ్డుకునేందుకు ఏమేం చేయాలో టిప్స్ చెప్పింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
మరోవైపు కరోనా వైరస్ పట్ల పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని అంటున్న వైద్యులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ వైరస్ బారినపడకుండా ఉండొచ్చని వారు చెబుతున్నారు. సాధారణంగా, ఏదేని ముప్పును ఎదుర్కొన్నపుడు లేదా ప్రమాదం సంభవించినపుడు మొదట శరీరం విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. తర్వాత అది పోరాడటమా? లేదా పారిపోవడమా? అనేది నిర్ణయించుకుంటుంది. ఈలోపు కలిగే ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. 
 
ఇక్కడ అతిపెద్ద ముప్పు భయమే. అందుకే భయం కలిగించే విషయాలు, ఆందోళన కలిగించే అంశాలను వ్యాప్తి చేయకూడదు. ఇలాంటి భయాందోళనలు కలింగే అంశాలు, వార్తలను వ్యాప్తి చేయడంలో అర్థం లేదు. "మీరు భయపడకండి. మీ శరీరాన్ని అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దు. మీ రోగనిరోధక శక్తిని నమ్మండి. అదే మిమ్మల్ని ఇలాంటి ఎన్నో వైరస్‌ల నుంచి రక్షిస్తుంది" అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం వారు కొన్ని చిట్కాలు, సూచనలు చేస్తున్నారు. 
 
ఇలా చేయండి..
* బయటి నుంచి వచ్చాక తప్పక చేతులు కడుక్కోవాలి. సానిటైజర్లు వాడాలి.  
* ముక్కు, నోరును చేతులతో తాకవద్దు.
* జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. రెండు మూడు వారాల కింద దేశ విదేశాల నుంచి వచ్చి దగ్గు, ఊపిరి ఆడని స్థితిలో ఉన్న వారికి దూరంగా ఉండండి. 
* జలుబు, జ్వరాలన్నీ కరోనా వైరస్‌కు సంబంధించినవి కావు. వాటిల్లో ఎక్కువ భాగం సాధారణ ఫ్లూలే కావచ్చు. సరైన మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. 
* దగ్గు, తుమ్ము వస్తే అర చేతులు అడ్డు పెట్టకండి. టిష్యూ పేపర్‌ లేదా కర్చీఫ్‌ వాడడం మంచిది. 
* నీరు తగినంత తాగండి. ఏ ఆహారమూ ఒక్కరోజులో మీ రోగనిరోధక శక్తిని పెంచదు. కానీ సిట్రస్‌ జాతి పండ్లు, వెల్లుల్లి తప్పక తీసుకోవాలి. 
* అనారోగ్యంతో ఉన్న వారిని, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లండి. వారు సురక్షితంగా ఉండేందుకు వీలైనంత సహాయం చేయండి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hey guysss! We have a very important message to all our friends, family and viewers out there. Be aware of Corona Virus and follow these procedures to help keep you and your family safe. . . . #aadyasitara❤️ #aadya #sitara #coronavírus #coronaaleart #covid_19 #staysafe #sanitizer #covid

A post shared by Aadya & Sitara (@aadyasitara) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments