Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్ గాడిద పాలు రూ. 100, తాగితే కరోనా పరార్ అంటున్నారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:08 IST)
ఆవు పాలు, గేదె పాలు తాగడం సహజమే. పాలిచ్చే గాడిదలను తీసుకుని వచ్చి వాటి పాలు తీసి అమ్ముతున్నారు. ఈ పాలు తాగితే కరోనావైరస్, ఒమిక్రాన్ పారిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది.. అంతా గాడిద పాల కోసం ఎగబడుతున్నారు. కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తుండటంతో జనం బారులు తీరారు.

 
ఇదంతా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరుగుతోంది. గాడిద పాలకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని ప్రచారం చేస్తుండటంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. దీనితో స్పూను గాడిద పాలు రూ. 100కి అమ్ముతున్నారు. లీటరు గాడిద పాలు కావాలంటే రూ.10,000 చెల్లించాలంటూ అడుగుతున్నారు. కొందరు అంత సొమ్ము ఇచ్చి గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు.

 
గాడిద పాలలో తల్లి పాలలో వుండే పోషకాలు వున్నప్పటికీ ఇది కరోనాను ఎదుర్కొంటుందంటూ ప్రచారం చేయడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనం మాత్రం గాడిద పాలను కొనడం ఆపడంలేదు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments