Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ లాక్ డౌన్.. కారణం ఏమిటంటే?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:02 IST)
భారత్‌లో మళ్లీ లాక్ డౌన్ పడే సూచనలున్నాయి. గత ఐదు రోజులుగా భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దాంతో అక్కడి చెంబూరును కవర్ చేసే ఎం వెస్ట్ వార్డులో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆ వార్డులో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో వార్డ్ ఆఫీస్... సోమవారం కొన్ని కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. అ
 
అంతేకాదు... అక్కడి ప్రజలంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. అధికారులు ఏమంటున్నారంటే... లాక్‌డౌన్ అని చెప్పకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితులే అక్కడ అమలుచేస్తున్నట్లు చెప్పారు. 
 
ప్రధానంగా కేసులు పెరగడానికి ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమే కారణం అంటున్నారు అధికారులు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడి ప్రజలు మాస్కులు వాడట్లేదు. శానిటైజర్లను వాడటం ఎప్పుడో మానేశారు. ఇక సేఫ్ డిస్టాన్స్ అనేది మాటలకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)పై ఒత్తిడి పెరుగుతోంది.
 
కరోనాను ఆ వార్డులో కంట్రోల్ చెయ్యకపోతే... అధి మళ్లీ ముంబై అంతటా విస్తరిస్తే... లేని పోని సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి మహారాష్ట్రలోనే కాదు... దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 
 
ఓవైపు లక్షల మందికి రోజూ వ్యాక్సిన్లు వేస్తున్నా... ఇలా యాక్టివ్ కేసులు 4 వేల దాకా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో దేశంలో లాక్డౌన్ పడే అవకాశాలున్నాయని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments