Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. అలెర్ట్ అవుతున్న రాష్ట్రాలు.. కర్ఫ్యూ ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:50 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లోనూ కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను తాకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్న తరుణంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఎలా ఉంటుందని ఓవైపు కొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. లాక్ డౌన్ దిశగా కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి.
 
మరోవైపు.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాయి. అయితే, ఈ కర్ఫ్యూ రాత్రి సమయంలో మాత్రమే అమలు చేయనున్నారు. నవంబర్‌ 21 నుంచి ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, విదిశ, రత్లామ్ జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మహారాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. 
 
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మరోవైపు.. గుజరాత్‌లోనూ శనివారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదరలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం నితిన్ పటేల్‌ ప్రకటించారు. ఇక, అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచి నవంబర్ 23వ తేదీ ఉదయం 6 గంటలకు సంపూర్ణంగా కర్ఫ్యూను అమల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments