వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా లంబ్డా.. పెరూలో సరికొత్త వైరస్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (08:41 IST)
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ప్రపంచదేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో చేదు వార్తను తెలియజేసింది. తాజాగా మరో కొత్త వేరియంట్‌ను 29 దేశాల్లో గుర్తించినట్లు వెల్లడించింది. 
 
పెరూలో తొలుత గుర్తించిన ఈ రకానికి లాంబ్డాగా నామకరణం చేశారు. ప్రస్తుతానికి దీన్ని అధ్యయనాసక్తి గల వేరియంట్‌ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)గా గుర్తించారు. దీనివల్ల ఎంత మేర ప్రమాదం పొంచి ఉందన్న దానిపై అధ్యయనం జరగాల్సి ఉంది.
 
తొలుత ఈ వేరియంట్‌ను ఆగస్టు 2020లో పెరూలో గుర్తించారు. ఇప్పటివరకు 29 దేశాలకు ఇది వ్యాపించింది. ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్‌ అమెరికా దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. ఏప్రిల్‌ నాటికి పెరూలో వెలుగులోకి వచ్చిన మొత్తం కేసుల్లో 81 శాతం లాంబ్డా వేరియంట్‌కు సంబధించినవే కావడం గమనార్హం. 
 
ఇక చిలీలో జన్యుక్రమ విశ్లేషణ జరిపిన నమూనాల్లో 61 శాతం వాటిల్లో కొత్త వేరియంట్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీని వ్యాప్తి కొన్ని దేశాల్లో ఆందోళనకర స్థాయిలోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పెరూ, చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటినాలో వైరస్‌ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments