కేర‌ళలో క‌రోనా విజృంభ‌ణ‌... 2 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌

Webdunia
గురువారం, 29 జులై 2021 (20:37 IST)
కేర‌ళలో క‌రోనా తిరిగి విజృంభిస్తోంది. ప్ర‌తి రోజు 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జులై 31, ఆగ‌స్టు 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది.

క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌డౌన్ విధించాల‌ని ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది.  
 
కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments