Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లెక్కలేనంత సంపదకు రారాజు అనంతపద్మనాభ స్వామి.. ఆ గదికి నాగబంధం..? (video)

Advertiesment
Thiruvananthapuram Padmanabhaswamy
, సోమవారం, 26 జులై 2021 (21:57 IST)
Thiruvanantapuram
కేరళలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు కొదువలేదు. అయితే అలాంటి దేవాలయాల్లో తిరువనంత పురంలోని అనంత పధ్మనాభ స్వామి దేవాలయం ప్రత్యేక స్థానం ఆక్రమించింది. స్కంద, పద్మ పురాణాలలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించారు. 
 
ఏడు పరుశురామ క్షేత్రాల్లో అనంత పధ్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. ప్రపంచంలో అత్యంత అధిక సంపద కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది తిరువనంతపురంలోని అనంత పధ్మనాభ స్వామి దేవాలయం. కేరళ రాష్ట్ర రాజధాని కేంద్రమైన తిరువనంతపురంలో ద్రవిడ శైలి నిర్మాణంలో ఈ ఆలయం నిర్మితమైంది. 8వ శాతాబ్ధానికి చెందిన దేవాలయంగా చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి పాము పడగప శయనిస్తున్న రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
 
1750లో ట్రావెన్కూరు సంస్థానాన్ని అప్పటి రాజు మార్తాండ వర్మ పధ్మనాభ స్వామికి అంకితమిచ్చాడు. ఆనాటి నుండి పధ్మనాభ స్వామి తరుపున రాజకుటుంబం ఆప్రాంతాన్ని పరిపాలించింది. రాజకుటుంబాన్ని పద్మానాభ దాసులుగా పిలిచేవారు. 
 
రాజులు సైతం తమ పేరు చివర పధ్మనాభ దాసగా పెట్టుకునే వారు. నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుండి తీసుకువచ్చిన 12008 సాలగ్రామాలతో అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూర్పు చేశారు. 18 అడుగుల ఎత్తులో ప్రధాన విగ్రహం ఉంటుంది. మూడు ద్వారాల గుండా స్వామిని భక్తులు దర్శిస్తారు.
 
80 అడుగుల ఎత్తులో ఉండే దేవాలయ ద్వజస్తంభం, బలిపీఠ మండపం, విశాలమైన కారిడార్ తోపాటు ఇక్కడ చెక్కబడ్డ శిల్పకళా సంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. దేశ నలుమూల నుండే కాక విదేశాల నుండి ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. లెక్కలేనంత బంగారు సంపద కలిగిన స్వామిగా అనంత పధ్మనాభునికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 
 
ఆలయంలోని నేలమాళిగల్లో లెక్కలేనంత సంపద భద్రంగా ఉంది. ఇప్పటి 5నేలమాళిగల్లో ఉన్న సంపదను బయటకు తీయగా, మరో గదికి నాగబంధం వేసి ఉండటంతో అందులోని సంపద ఎంత ఉందోనన్న సమాచారం ఎవ్వరికీ తెలియలేదు. తరతరాల నుండి వస్తున్న సంపదను ట్రావెన్ కోర్ సంస్ధానం పాలకులు సంరక్షకులుగా ఉంటూ సంరక్షిస్తున్నారు.
 
హిందువులు పవిత్రంగా భావించే శ్రీ మహావిష్ణువు కొలువైన తిరువనంత పురం అనంతపధ్మనాభుడిని దర్శించుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలతోపాటు, విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ దేవాలయంలోకి ప్రవేశించే వారు షర్టు ధరించకుండా ధోతితో స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు చీరా, జాకెట్, ఓణిలు ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే..