Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 25 కరోనా బులిటెన్ : 51 వేల పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:16 IST)
దేశంలో జూన్ 25వ తేదీ శుక్రవారం కరోనా బులిటెన్ వెల్లడైంది. ఈ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 51,667 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
అలాగే, 64,527 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇకపోతే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, గురువారం 1,329 మంది కరోనా బాధితులు చనిపోయారు. 
 
దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
   
కాగా, దేశంలో శుక్రవారం వరకు మొత్తం 39,95,68,448 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 24న 17,35,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments