ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 5674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,068 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 166 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 45 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. 8,014 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,44,917కి చేరగా... 17,67,404 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 60,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 97,743 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 డోసులు ఇవ్వడం జరిగింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments