Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మూలాలు కనుగొన్న భారత్ : కరోనాపై విజయం ఖాయమా?

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (08:29 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్... చైనాలోను వూహాన్ నగరంలో పురుడు పోసుకుంది. అయితే, దీని మూలాలు మాత్రం కనుగొనలేకపోతున్నారు. ఫలితంగా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా, కొన్ని కోట్ల మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. అయితే, ఇపుడు భారత్ ఓ కీలక విషయాన్ని గుర్తించింది. కరోనా మూలాలు కనుగొన్నట్టు సమాచారం.
 
ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన కొత్త కరోనా వైరస్ పైనా విజయం సాధించే దిశగా భారత్ చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఐసీఎంఆర్ యూకే నుంచి వచ్చిన సార్స్ - కోవ్-2 వేరియంట్ నమూనాలను సేకరించి, ఆ వైరస్ జాడలు, జన్యు క్రమాన్ని కనుగొన్నామని తెలిపింది.
 
ఈ వైరస్‌ను ఎన్ఐవీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)లో పెంచుతున్నామని, తద్వారా వైరస్‌కు విరుగుడు కనుక్కోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కొత్త వైరస్ భవిష్యత్తులో ఇంకెలా మారుతుందన్న వివరాలనూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని తెలిపారు. 
 
మరోవైపు, కరోనా రక్కసిని పారదోలేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి తెరలేచిన నేపథ్యంలో, భారత్‌లో కూడా ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) నిపుణులు బృందం పలు దఫాలుగా సమావేశమై వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతులపై చర్చించింది. 
 
తాజాగా జరిగిన సమావేశంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు ఆమోదం తెలిపింది. దాంతో భారత్‌లో ఇప్పటివరకు అనుమతులు పొందిన కరోనా వ్యాక్సిన్‌ల సంఖ్య రెండుకు చేరింది. 
 
అయితే, ఈ రెండు వ్యాక్సిన్‌లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో డీసీజీఐ అనుమతి లాంఛనమేనని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments