Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి కరోనా వ్యాక్సిన్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (11:55 IST)
హైదరాబాద్‌కు చెందిన ‘బయాలాజికల్‌-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్‌ టీకాను పిల్లలకు వేయనున్నామని తెలిపింది. ఈ క్రమంలో 12-14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ను వేయనున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ లాంటివి జరుగకుండా చూసుకోవాలని కోరింది. టీకా ఇవ్వడంలో శిక్షణ పొందిన వారినే వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌లో నియమించాలని తెలిపింది. టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. టీకాల వృథాను అరికట్టాలని కోరింది.
 
తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2010 లేదా అంతకన్నా ముందు జన్మించినవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.
 
12 ఏళ్ల నిండినవాళ్లు మాత్రమే పేరును నమోదు చేసుకోవాలని, ఒకవేళ 12 ఏండ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇవ్వమని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments