Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022కు గాను బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్ ను ప్రకటించిన బీఏఎఫ్ టీఏ

2022కు గాను బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్ ను ప్రకటించిన బీఏఎఫ్ టీఏ
, మంగళవారం, 15 మార్చి 2022 (18:32 IST)
బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) నేడిక్కడ, ‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియాలో పాల్గొనే భారతీయ సినిమా, గేమ్స్, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన వర్ధమాన కళాకారుల పేర్లను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి నెట్ ఫ్లిక్స్ అండగా నిలువనుంది. పరిశ్రమ నిపుణులతో రూపొందిన క్రాస్- ఇండస్ట్రీ గ్లోబల్ జ్యూరీచే సంచలనాత్మక పార్టిసిపంట్స్ ఎంపికయ్యారు. ఈ జ్యూరీలో అపూర్వ అస్రాని, అనుప్ ఖేర్, ఏఆర్ రెహమాన్, రత్నపాఠక్ షా, షోనాలి బోస్ తదితరులు ఉన్నారు.

 
2022 కుగాను బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా పార్టిసిపంట్స్ జాబితా:
అజిత్‌పాల్ సింగ్, దర్శకుడు/రచయిత (తబ్బర్)
అలోకానంద దాస్‌గుప్తా, సంగీత స్వరకర్త/దర్శకుడు (సేక్రెడ్ గేమ్స్ - సంగీత స్వరకర్త)
ఆరతి కడవ్, దర్శకురాలు/రచయిత్రి (కార్గో)
లీనా మణిమేకలై, దర్శకురాలు/రచయిత్రి (మాదతి, యాన్ ఫెయిరీ టేల్)
మతివానన్ రాజేంద్రన్, నిర్మాత (నిర్వాణ ఇన్)
నకుల్ వర్మ, గేమ్ డైరెక్టర్ (ఇన్ మై షాడో)
ప్రతీక్ వాట్స్, దర్శకుడు/రచయిత (ఈబ్ అల్లయ్ ఊ!)
సౌమ్యానంద సాహి, సినిమాటోగ్రాఫర్ (ఈబ్ అల్లయ్ ఊ!)
శుభం, రచయిత (ఈబ్ అల్లాయ్ ఊ!)
సుముఖి సురేష్, నటి (పుష్పవల్లి)

 
బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా 2022 జ్యూరీ జాబితాలో ఎఆర్ రెహమాన్, అనుపమ్ ఖేర్, అపూర్వ అస్రానీ, చారు డెసోద్ట్, గౌరవ్ గాంధీ, గునీత్ మోంగా, కృష్ణేందు మజుందార్, మోనికా షెర్గిల్, రత్న పాఠక్ షా, షోనాలి బోస్, సిద్ధార్థ్ రాయ్ కాల్‌పూర్ ఉన్నారు. ఇంకా, ఈ సంవత్సరం కార్యక్రమం దేశంలోని ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు గాను సంబంధిత నెట్‌వర్క్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి, భారతీయ సినిమా, గేమ్స్,  టెలివిజన్ పరిశ్రమల నుండి వరుసగా 'సపోర్టర్స్'గా గునీత్ మోంగా, విశాల్ గొండాల్ మరియు రత్న పాఠక్ షాలతో అదనపు సహకారాన్ని పొందింది.

 
కార్యక్రమంలో పాల్గొనేవారికి ఉత్తమ బ్రిటిష్, భారతీయ సృజనకారులతో అనుసంధానం అయ్యేందుకు, వారి నుండి నేర్చుకునే అవకాశం అందించబడుతుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచరులతో వారి నైపుణ్యాన్ని పంచుకుంటారు. అంతేకాకుండా, పాల్గొనేవారు ఒకరితో ఒకరు సమావేశాలు, గ్లోబల్ నెట్‌వర్కింగ్ అ వకాశాలు, 12 నెలల పాటు బీఏఎఫ్ టీఏ ఈవెంట్‌లు, స్క్రీనింగ్‌లకు ఉచిత యాక్సెస్ పొందగలుగుతారు. అంతే గాకుండా,  పూర్తి స్థాయిలో బీఏఎఫ్ టీఏ ఓటింగ్ సభ్యత్వాన్ని అందుకుంటారు. వారు అంతర్జాతీయ అవకాశాల ను పొందడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ కళాకారులుగా ప్రచారం చేయబడతారు.

 
 ఈ సందర్భంగా బీఏఎఫ్ టీఏ లెర్నింగ్ అండ్ న్యూ టాలెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హంటర్ మాట్లాడుతూ, “బ్రేక్‌త్రూ అనేది బీఏఎఫ్ టీఏ యొక్క ఫ్లాగ్‌షిప్ టాలెంట్ ఇనిషియేటివ్. ఇది తొమ్మిదేళ్లుగా ప్రతిభను గుర్తించి, వారు ఎంచుకున్న కెరీర్‌లో వృద్ధి చెందడానికి వారిని ప్రోత్సహిస్తూ వచ్చింది. వారికి అవసరమైన మద్దతును అందించింది. భారతదేశంలోని మా విజయవంతమైన మొదటి కార్యక్రమం ద్వారా, యూకే, ఇతర దేశాల్లో  పరిశ్రమ నెట్‌వర్క్‌లకు విస్తృత, విభిన్నమైన సృజనకారులను పరిచయం చేయగలిగినందుకు మేం సంతోషిస్తు న్నాం.

 
ప్రపంచ వేదికపై వారి ప్రతిభను గుర్తించడంలో సహాయం చేస్తాము. మా రెండవ కార్యక్రమంతో ఇది మరోసారి వచ్చాం. ఎందరో ప్రతిభావంతుల్లో కొందరిని మాత్రమే గుర్తించగలిగాం. ప్రపంచ-స్థాయి ప్రతిభతో కూడిన వారితో పని చేయడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. కొత్త సృజనాత్మక ప్రతిభను ప్రేరేపించడం, మద్దతు ఇవ్వడం, వేడుక చేసుకోవడం లో మాకు తోడుగా నిలిచినందుకు నెట్ ఫ్లిక్స్ కు  మా కృతజ్ఞతలు. మా కొత్త స మూహానికి అభినందనలు, బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ కుటుంబంలోకి వారికి మా స్వాగతం” అని అన్నారు.

 
బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ ఇండియా ప్రచారకర్త, జ్యూరీ చైర్ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, “మేం అందుకున్న నమ్మశక్యం కాని అప్లికేషన్‌లలో కేవలం 10 మంది పార్టిసిపెంట్‌లను ఎంపిక చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఎంపిక చేసిన 10 మంది భారతదేశ సృజనాత్మక వైవిధ్యాన్ని ప్రతి బింబిస్తూ వివిధ ప్రాంతాలు, వృత్తులు, భాషలకు చెందిన వ్యక్తుల యొక్క విభిన్న కలయిక. బీఏఎఫ్ టీఏ బ్రేక్‌ త్రూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన అవకాశాలను అందిస్తుంది. ఈ పదిమంది భారతీయ ప్రతిభా వంతులతో కూడిన 2022 బృందం తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు.

 
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, "భారతదేశం కథకులు,  సృజన కారులకు ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంది. బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ ఇండియా ద్వారా ఇలాంటి  వేదికకు అర్హులైన తాజా, కొత్త గొంతుకలు, ప్రతిభను గుర్తించి, శక్తివంతం చేయడానికి మా వంతు కృషి చేయడానికి మేం సంతోషి స్తున్నాం. ఈ సంవత్సరం మేం ఎన్నో అద్భుతమైన దరఖాస్తులను అందుకున్నాం. ఎంపికైన పదిమందికి అభినందనలు. వారు తమ రంగాలలో సృజనాత్మక తరంగాన్ని ఎలా రూపొందిస్తారో, పరిశ్రమకు ఎలా దోహద పడుతున్నారో చూడడానికి మేము ఇక వేచి ఉండలేం’’ అని అన్నారు.
 
 
2013లో ప్రారంభించినప్పటి నుండి, బీఏఎఫ్ టీఏ బ్రేక్‌త్రూ 160కి పైగా వర్ధమాన ప్రతిభావంతులకు మద్దతునిచ్చింది.  వీరిలో ఫ్లోరెన్స్ పగ్, లెటిటియా రైట్, టామ్ హాలండ్, జోష్ ఓ'కానర్, గెమ్మా లాంగ్‌ఫోర్డ్, జిమ్ లెబ్రెచ్ట్ వంటి అనేక మంది ఇతర వ్యక్తులు ఉన్నారు. చలనచిత్రం, గేమ్స్, టెలివిజన్ విభాగాల్లో సృజనాత్మక, సాంస్కృతి క మార్పిడిని సులభతరం చేయడాన్ని ఈ కార్యక్రమం తన లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో భారతదేశంలో ప్రారంభించిన తర్వాత, అక్షయ్ సింగ్, అరుణ్ కార్తీక్, జే పినాక్ ఓజా, కార్తికేయ మూర్తి, పలోమి ఘోష్, రేణు సావంత్, శృతి ఘోష్, సుమిత్ పురోహిత్, తాన్య మానిక్తల, విక్రమ్ సింగ్ వంటి వారు తొలి భారతీయ బృందంలో పాల్గొన్నారు. బీఏఎఫ్ టీఏ మునుపటి బ్రేక్‌త్రూ పూర్వ విద్యార్థులు అనేక మంది వారి కెరీర్‌లో అభివృద్ధి చెందారు, వారిలో చాలామంది బీఏఎఫ్ టీఏ విజేతలు, నామినీలుగా కూడా మారారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్సీగా వుండే దుస్తులు ధ‌రిస్తే త‌క్కువ‌ అంచ‌నావేయ‌కండి - నీనా గుప్తా