Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కేసులు - రికవరీ రేటు .. తగ్గుతున్న మరణాలు...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (13:20 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరో శుభవార్త ఏంటంటే.. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
దేశంలో గత 24 గంటల్లో 86,432 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40,23,179కి పెరిగింది.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల జోరు ఇలాగే కొనసాగితే బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో 40,91,801 కేసులు నమోదయ్యాయి. 
 
భారత్‌లో ఆ సంఖ్య 40,23,179గా ఉంది. అంటే రెండు దేశాల మధ్య తేడా 68,622 మాత్రమే. కాగా, శుక్రవారం కరోనా కారణంగా 1,089 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు 69,561 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మొత్తం బాధితుల్లో 8,46,395 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 31,07,223 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతానికి తగ్గడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 8,46,395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిన్న 10,59,346 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,511 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు పెరిగింది. 
 
శుక్రవారం ఒక్క రోజే 11 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 877కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 కేసులు వెలుగుచూశాయి. ఇక, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండడం ఊరటనిచ్చే విషయం.
 
శుక్రవారం ఒక్క రోజే 2,579 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,04,603 మంది కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 
 
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 62,132 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 16,67,653కు పెరిగింది. రాష్ట్రంలో 25,729 మంది హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments