Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి ద్వారా కరోనా వ్యాప్తి... పాజిటివ్ రేటు.. 12 రోజుల్లో డ‌బుల్

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (17:39 IST)
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు గాలిద్వారా కూడా వ్యాపిచెందడం ఆందోళన కలిగిస్తోందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్‌సైన్సెస్ (ఎయిమ్స్‌) చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా చెప్పుకొచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ కోసం ఒక ఎన్‌95 మాస్క్‌ను స‌రిగ్గా ధ‌రిస్తే స‌రిపోతుంద‌న్నారు. ఒక‌వేళ బ‌ట్ట‌తో చేసిన లేదంటే స‌ర్జిక‌ల్‌ మాస్కులు వాడుతుంటే.. రెండు పెట్టుకోవాల‌ని సూచించారు. ఈ మాస్కులు కూడా ఖచ్చితంగా మీ నోరు, ముక్కును పూర్తిగా క‌వ‌ర్ చేసేలా చూసుకోవాల‌న్నారు. 
 
గాలి ద్వారా కొవిడ్ ఆందోళ‌న‌క‌ర‌మ‌న్న ఆయ‌న‌.. ఇళ్ల‌లో వెంటిలేష‌న్ అనేది చాలా ముఖ్య‌మ‌న్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించ‌క‌పోవ‌డం, వైర‌స్ మ్యుటేష‌న్ అనేవి దేశంలో కేసులు ఈ స్థాయిలో పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.
 
మరోవైపు, దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డ‌బుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గ‌త నెలలో వారాంత‌ పాజిటివిటి రేటు కూడా 3.05 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగింది.
 
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అత్య‌ధికంగా వీక్లీ పాజిటివిటి రేటు 30.38 శాతంగా ఉన్న‌ది. 24.24 శాతంతో గోవా, 24.17 శాతంతో మ‌హారాష్ట్ర‌, 23.33 శాతంతో రాజ‌స్థాన్‌, 18.99 శాతంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌ర్వాత స్థానాల్లో ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments