మళ్లీ కలవరపెడుతున్న కరోనా... పెరుగుతున్న జేఎన్ 1 వేరియంట్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (11:48 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతుంది. గత కొన్ని రోజులుగా కోవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 358 కేసులు నమోదయ్యాయి. అలాగే, కేరళలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. జీఎన్ 1 కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2666కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 కేసుల గుర్తించిన నేపథ్యంలో కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది. 
 
తాజాగా కేరళ, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. ఇక కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments