Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రోజుకో రికార్డు నెలకొల్పుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:54 IST)
దేశంలో కరోనా వైరస్ రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఒక్క రోజులోనే ఏకంగా 75 వేలకు మించిన పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా గడచిన 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,83,948 మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో గురువారం వరకు మొత్తం 3,94,77,848 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులోనే 9,01,338  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments