Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీని దాటేసిన భారత్.. జూన్ 8 నుంచి అన్ లాక్ పరిస్థితి..?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (09:48 IST)
కరోనా కేసుల విషయంలో భారత్ ఇటలీని దాటేసింది. భారత్‌లో కరోనా వైరస్ కేసులు 2.35 లక్షలు దాటాయి. ఇక భారత్‌లో మరణించిన వారి సంఖ్య 6600గా ఉన్నది. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. వలస కూలీల తరలింపు ప్రక్రియ మొదలైన తర్వాత.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 24 గంటల్లో 343 మంది ఈ వైరస్ సోకడంతో మృత్యవాత పడ్డారు.
 
మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటలీలో 2,34,531 మందికి వైరస్ సోకగా, భారత్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2,36,117గా ఉన్నది. సుమారు 19 రాష్ట్రాల్లో కరోనా సోకిన కేసుల సంఖ్య నాలుగు అంకెలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 
దేశంలో నాలుగు విడతలుగా లాక్ డౌన్ విధించినా, ఐదవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా రోజుకి సరాసరిన 9000 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌-19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్‌దే. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్‌ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments